Gut Health: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, మన జీర్ణాశయం అంటే గట్ ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. గట్ అనారోగ్యంగా ఉంటే అది కేవలం జీర్ణ సమస్యలకే కాకుండా, మన మెదడుపై, శక్తి స్థాయిపై, మానసిక స్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత అవసరమో, గట్‌ను శుభ్రంగా, సమతుల్యంగా ఉంచుకోవడం అంతకంటే ముఖ్యమైందీ. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని సీడ్స్‌ను చేర్చుకుంటే గట్ హెల్త్‌ను మెరుగుపరచడం చాలా సులభం. అందుకే గట్‌ను క్లీన్‌గా ఉంచే మూడు అద్భుతమైన విత్తనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
![]() |
Chia Seeds |
చియా సీడ్స్: ఇవి నీటిలో నానబెట్టినప్పుడు జెల్ లాంటి రూపాన్ని తీసుకుంటాయి. అందులో ఉండే కరిగే ఫైబర్, మన పేగుల పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది మలాన్ని మృదువుగా చేసి, సులభంగా బయటికి పంపుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలోనూ ఇది సాయపడుతుంది. అయితే ఈ విత్తనాలను ఎప్పుడూ నీటిలో నానబెట్టి మాత్రమే తినాలి. మీరు చియా సీడ్స్‌ను బెర్రీలు, పెరుగు లేదా బాదం పాలు వంటి వాటిలో కలిపి తీసుకుంటే మరింత లాభం పొందవచ్చు.
Also Read: వర్షాకాలంలో తినకూడని కూరగాయలు ఇవే!
![]() |
Sabja Seeds |
సబ్జా గింజలు: ఇవి చియా విత్తనాలకు దాదాపు సమానమే అయినప్పటికీ, శరీరానికి చల్లదనాన్ని కలిగించే ప్రత్యేకత ఉన్నాయి. గ్రీష్మకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇవి కూడా నీటిలో నానబెట్టి, ఓట్స్, బాదం పాలు, లేదా బాదం పెరుగు వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఇవి మీ రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే, మీ జీర్ణ వ్యవస్థ చాలా హాయిగా పనిచేస్తుంది.
Also Read: చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు.!
![]() |
Flax Seeds |
Also Read: మొలకెత్తిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు తినడం ఎందుకు ప్రమాదం?
అవిసె గింజలు: చిన్నగా కనిపించే ఈ విత్తనాల్లో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో, హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలో, అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో చాలా ఉపయోగపడతాయి. అయితే, ఈ గింజలను నేరుగా తినకూడదు. వేయించి పొడిచేసి మాత్రమే తీసుకోవాలి – అప్పుడు మాత్రమే అవి శరీరానికి పూర్తి పోషణనిచ్చేలా పనిచేస్తాయి. అవిసె పొడిని చింతపండు రసం, గంజి, లేదా సూప్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
చియా, సబ్జా, మరియు అవిసె... ఈ మూడు సీడ్స్ గట్ ఆరోగ్యానికి ఒక వరం లాంటివి. ఇవి సహజమైనవి, గింజలే అయినా, శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేసి జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచుతాయి. చిన్న మార్పుతో పెద్ద ఫలితాన్ని కోరుకునే వారు ఈ విత్తనాలను రోజువారీ జీవనశైలిలో తప్పకుండా చేర్చుకోవాలి.
మరిన్ని Latest Health Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V Health